English

Tholi Prema Collections: 26 ఏళ్ళ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,కీర్తి రెడ్డి (Keerthi Reddy) జంటగా ఎ.కరుణాకరణ్ (A. Karunakaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలిప్రేమ’ (Tholi Prema ) . ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.జి.రాజు (G. V. G. Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో 4వ సినిమాగా రూపొందిన ‘తొలిప్రేమ’ పవన్ కళ్యాణ్ కి ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాకి ముందు పవన్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) (యావరేజ్), ‘గోకులంలో సీత’ (Gokulamlo Seeta) (హిట్), ‘సుస్వాగతం’ (Suswagatham) (సూపర్ హిట్).. వంటివి చిరంజీవి (Chiranjeevi)  తమ్ముడు సినిమాలుగానే రిలీజ్ అయ్యాయి.

పైగా వాటిని డైరెక్ట్ చేసింది స్టార్ డైరెక్టర్లు. అందుకే పవన్ సినిమాలపై నమ్మకం ఏర్పడేలా చేసింది ‘తొలిప్రేమ’ అనే చెప్పాలి. 1998 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 26 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘తొలిప్రేమ’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.97 cr
సీడెడ్ 1.52 cr
ఉత్తరాంధ్ర 1.04 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.51 cr
గుంటూరు 0.69 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.32 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  8.60 cr

‘తొలిప్రేమ’ చిత్రం రూ.4.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.4.33 కోట్ల లాభాలు అంటే డబుల్ ప్రాఫిట్స్ అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు >

Follow Us On

Also Read ----