English

డార్లింగ్

  • ప్రియదర్శి (Hero)
  • నభా నటేష్ (Heroine)
  • కృష్ణతేజ, అనన్య నాగళ్ల, విష్ణు (Cast)
  • అశ్విన్ రామ్ (Director)
  • నిరంజన్ రెడ్డి – చైతన్య రెడ్డి (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • నరేష్ రామదురై (Cinematography)

“ఇస్మార్ట్ శంకర్”తో (iSmart Shankar)  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయి.. వరుసబెట్టి సినిమాలు చేస్తున్న తరుణంలో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా పెద్ద గ్యాప్ తీసుకొని.. మళ్ళీ తన సత్తా చాటుకొనేందుకు నభా నటేష్ (Nabha Natesh) చేసిన డేరింగ్ అటెంప్ట్ “డార్లింగ్” (Darling) . ఈ చిత్రంలో మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీతో తాను బాధపడుతూ తన భర్తను బాధపెట్టే యువతిగా నభా నటించింది. ఈ చిత్రం ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా అలరించింది. ఈవారం విడుదలైన సినిమాల్లో కూడా “డార్లింగ్” ఒక్కటే చెప్పుకోదగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుండి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్ కి హనీమూన్ వెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న రాఘవ్ (ప్రియదర్శి)కి (Priyadarshi) పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో.. ఆత్మహత్య చేసుకుందామని కొండపైకి వెళ్లగా.. అక్కడ పరిచయమవుతుంది ఆనంది (నభా నటేష్). పరిచయమైన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుంటారు ఇద్దరు.

అయితే.. తాను పెళ్లి చేసుకున్న ఆనందిలో ఆమెకే తెలియని మరికొంత మంది ఉన్నారని తెలిసి బెంబేలెత్తిపోతాడు రాఘవ్. ఈ అరడజను అడ మందతో రాఘవ్ పడిన కష్టాల సమాహారమే “డార్లింగ్”.

నటీనటుల పనితీరు: ఆరేడు వైవిధ్యమైన పాత్రలను తెరపై ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టపడింది నభా నటేష్. ఆనంది, ఆది అనే రెండు కీలకమైన పర్సనాలిటీలు ప్రదర్శినలో ఆకట్టుకున్న నభా.. మిగతా నాలుగు పర్సనాలిటీలను పండించడంలో మాత్రం తడబడింది. ముఖ్యంగా.. పాప & ఝాన్సీ పర్సనాలిటీలను ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టపడింది. అయినప్పటికీ.. ఆమెకు ఉన్న అనుభవానికి, ఆరేడు విభిన్నమైన పాత్రలు పోషించడం అనేది అభినందించాల్సిన విషయం.

ప్రియదర్శి ఒక ఫ్రస్ట్రేటడ్ హజ్బెండ్ గా విశేషంగా ఆకట్టుకున్నాడు. భార్య పెట్టే కష్టాలు భరించలేక బాధపడే సగటు భర్తగా, ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్ని సమస్యలైనా ఎదుర్కొనే యువకుడిగా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైనవాళ్లు మరియు ప్రేమలో ఉన్నవాళ్లు ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు.

అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిన్న పాత్ర అయినప్పటికీ.. పర్వాలేదనిపించుకుంది. కృష్ణతేజ (Krishna Teja), విష్ణు  (Vishnu Oi) , మురళీధర్ లు (Muralidhar Goud) కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే.. వారి డైలాగుల్లో అపశృతులు కాస్త ఎక్కువగా దొర్లాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సదరు డైలాగ్స్ వినిపించినప్పుడు కాస్త ఇబ్బందిపడతారు. రఘుబాబు (Raghu Babu), నిహారికలు తమ తమ పాత్రలకు మంచి వేల్యూ యాడ్ చేసారు.

 

ట్రెండింగ్ వార్తలు >

Follow Us On

Also Read ----