English

Darling Collections: ‘డార్లింగ్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

ప్రియదర్శి (Priyadarshi)  హీరోగా నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్ గా ‘డార్లింగ్’ (Darling) అనే సినిమా రూపొందింది. ‘హనుమాన్’ (Hanu Man) వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ అందించిన ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, అతని భార్య చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్విన్ రామ్ (Aswin Raam)  ఈ చిత్రానికి దర్శకుడు. జూలై 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పైగా ప్రభాస్ (Prabhas)  సూపర్ హిట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్ ను వాడుకోవడంతో ఈ సినిమా బాగా ప్రమోట్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోపక్క వర్షాలు ఎడతెగకుండా కురుస్తుండడంతో సో సో ఓపెనింగ్స్ నే రాబట్టింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.60 cr
సీడెడ్ 0.16 cr
ఆంధ్ర(టోటల్) 0.43 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.16 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.35 cr

‘డార్లింగ్’ చిత్రానికి రూ.5.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.35 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.15 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు >

Follow Us On

Also Read ----