మొన్నీమధ్యే మన సైట్లో చదివి ఉంటారు మీరు ఈ వార్త. అలా అని ఇది పాత విషయం చెప్పడం కాదు. ఎందుకంటే మొన్నటి వార్తకు ఇది యాడ్ ఆన్. ఆ రోజు వార్తలో సమ్‌థింగ్ స్పెషల్‌గా టాలీవుడ్లో జరుగుతోంది అని చెప్పాం. ఇప్పుడు దానికి దృశ్యరూపకంగా ఈ వార్తలో చెబుతున్నాం. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కోసం సినిమా టీమ్ బెంగళూరులోని చిరంజీవి (Chiranjeevi) ఫామ్ హౌస్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ చేపట్టారు అని వార్త చదివే ఉంటారు. ఇప్పుడు దాని గురించే ఇదంతా.
టాలీవుడ్‌లోని యంగ్ స్టార్ సింగర్స్ ఇటీవల హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. ఎయిర్పోర్ట్ నుండి డైరక్ట్‌గా చిరంజీవి ఫామ్ హౌస్‌లో దిగారు. అక్కడ అప్పటికే వీరి కోసం అన్ని రకాల ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఇక మొదలెట్టారు చూడండి.. గానా బజానా ఓ లెవల్లో జరిగింది. పాటలు రాయడం, ట్యూన్లు కట్టడం, పాడటం, మార్పులు చేయడం, మళ్లీ రాయడం, పాడటం.. ఇదే వరుస.







