న్యాచురల్ స్టార్ నాని (Nani) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా నుంచి ఈరోజు గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్ రోల్ లో నటిస్తుండగా సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నాట్ ఏ టీజర్ అంటూ ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం గమనార్హం.
ఆగష్టు నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా 80 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనే అభిప్రాయాన్ని ఈ గ్లింప్స్ కలిగిస్తోంది. “అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.. ప్రజల్ని బాగా హింసించేవాడు” అంటూ పోలీస్ పాత్రలో ఎస్జే సూర్యను పరిచయం చేశారు. “అందుకే శ్రీ కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించాడు” అంటూ నాని చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది.







