English

భారతీయుడు 2

  • కమల్ హాసన్ (Hero)
  • కాజల్ అగర్వాల్ (Heroine)
  • సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్ , నెడుముడి వేణు , వివేక్ , బాబీ సింహా (Cast)
  • ఎస్. శంకర్ (Director)
  • సుభాస్కరన్ అల్లిరాజా , ఉదయనిధి స్టాలిన్ (Producer)
  • అనిరుధ్ రవిచందర్ (Music)
  • రవి వర్మన్ (Cinematography)

1996లో వచ్చిన “భారతీయుడు” సృష్టించిన సంచలనాలను ప్రేక్షకులు ఇంకా మరువలేదు. శంకర్ (Shankar)  గ్రాండియర్, కమల్ హాసన్ (Kamal Haasan) నటన, రెహమాన్ (A.R.Rahman) సంగీతం.. ఇలా ప్రతి ఒక్క అంశం ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకుల మెదళ్ళలో మాత్రమే కాదు మనసుల్లోనూ మెదులుతూనే ఉంది. ఆ చిత్రానికి సీక్వెల్ గా దాదాపు 18 ఏళ్ల తర్వాత విడుదలైన చిత్రం “భారతీయుడు 2” (Bharateeyudu 2) . ఈ సీక్వెల్ కు సంగీతం అనిరుధ్ (Anirudh Ravichander) అందించడం విశేషం. మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: అవినీతి అంతకంతకూ పెరిగిపోతుంటుంది, ఆ అన్యాయాన్ని ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా వేలెత్తి చూపిస్తూ అవగాహన కల్పిస్తుంటారు టీం “బార్కింగ్ డాగ్స్”. చిత్ర అరవింద్ (సిద్ధార్ధ్ Siddharth)), ఆర్తి (ప్రియభవాని శంకర్ Priya Bhavani Shankar) తదితరులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా “కమ్ బ్యాక్ ఇండియన్” అనే నినాదాన్ని వైరల్ చేసి సేనాపతి (కమల్ హాసన్)ను ఇండియాకి రప్పిస్తారు. అయితే.. సీ.బి.ఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా Bobby Simha ) సేనాపతిని పట్టుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తుంటాడు.

సేనాపతి టార్గెట్ ఎవరు? అక్రమాలు లేని భారతదేశాన్ని సాధించడం కోసం భారతీయుడు మొదలెట్టిన రెండో స్వాతంత్ర్య ఉద్యమం ఎలా ముందుకెళ్లింది? అనేది తెలియాలంటే “భారతీయుడు 2” చూసి.. “భారతీయుడు 3” వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

నటీనటుల పనితీరు: 70కి దగ్గరవుతున్న కమల్ హాసన్ “భారతీయుడు 2″లో కనిపించిన గెటప్స్ లో మెప్పించడం కోసం వేసుకున్న ప్రోస్థెటిక్స్ కోసమైనా ఆయన్ను మెచ్చుకొని తీరాలి. ఈ సినిమాలో ఆయన దాదాపు 6 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అయితే.. ఆయనకి ఈ సినిమాలో ఎమోషన్స్ పండించే అవకాశం ఎక్కువ రాలేదు. అసలు సినిమా మొత్తం మూడో భాగంలోనే ఉందని సినిమా చివరన వచ్చే ట్రైలర్ తో స్పష్టమైంది.

సిద్ధార్ధ్ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. రకుల్ (Rakul Preet Singh) పాత్ర నిడివి చాలా తక్కువ. అలాగే.. ప్రియభవాని శంకర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించినప్పటికీ, పాత్రను పండించలేకపోయింది. ఇక పరభాషా నటులు బోలెడుమంది విలన్లుగా కనిపించి, కనుమరుగయ్యారు కానీ.. ఎలాంటి ఆసక్తి కలిగించలేకపోయారు.

ట్రెండింగ్ వార్తలు >

Follow Us On

Also Read ----